: నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఏపీనే: గణతంత్ర ప్రసంగంలో గవర్నర్


భారత 67వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రజలను ఉద్దేశించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొద్దిసేపటి క్రితం ప్రసంగించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. తొలుత తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన గవర్నర్... ఆ తర్వాత ఆంగ్లానికి మారారు. చివరలో మళ్లీ తెలుగుకు మారిన ఆయన రాయప్రోలు సుబ్బారావు వ్యాఖ్యల ప్రస్తావనతో ప్రసంగాన్ని ముగించారు. దేశంలోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఏపీనేనని ఆయన పేర్కొన్నారు. గోదావరి నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు పట్టిసీమ పేరిట కేవలం ఐదు నెలల్లో కొత్త ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. రెండంకెల వృద్ధిని సాదించే దిశగా రాష్ట్రం పరుగులు పెడుతోందన్నారు. తెలుగు భాష ఎంతో రమణీయమైనదన్నారు. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రికార్డు స్థాయిలో రూ.4.70 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టామన్నారు. రాష్ట్రంలో కాపుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక కాపు కార్పొరేషన్ కు రూ.100 కోట్లు విడుదల చేశామన్నారు. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News