: రిపబ్లిక్ డే సందర్భంగా స్పైస్ జెట్ ప్రత్యేక ఆఫర్లు


పండుగలు, వేడుకలను పురస్కరించుకుని ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఇండియా విల్ ఫ్లై సేల్' పేరుతో ఆఫర్లను ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఎంపిక చేసిన టికెట్లపై డిస్కౌంట్లు ఇస్తున్నట్టు తెలిపింది. దేశీయ టికెట్ ప్రారంభ ధర రూ.826 (పన్నులు అదనం), అంతర్జాతీయ టికెట్ ప్రారంభ ధర రూ.3,029 (పన్నులు అదనం)గా నిర్ణయించినట్టు తెలిపింది. ఈ టికెట్ల సేల్ నేటి నుంచి బుధవారం వరకు ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 12లోపు ప్రయాణించేవారు ఈ ఆఫర్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఒక వైపు వెళ్లే వారికి మాత్రమే ఈ సేల్ లో డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ సేల్ లో బుక్ చేసిన టికెట్లను ఒకవేళ రద్దు చేసుకుంటే రిఫండ్ రాదు. అదనపు పన్నులు మాత్రమే తిరిగి చెల్లిస్తారు.

  • Loading...

More Telugu News