: భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై హైకోర్టు స్టే


ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి చేయదల్చిన భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. ఇప్పటికే ప్రభుత్వం భూసేకరణ చేయనున్న గ్రామాల్లో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో 12 గ్రామాల ప్రజలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ఇవాళ స్టే విధిస్తున్నట్టు తెలిపింది. దాంతో జిల్లా కలెక్టర్ ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ నిలిచిపోనుంది. భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం రెండు సంవత్సరాల కిందట 5,315 ఎకరాల భూమి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యకం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News