: ప్రియాంక నిర్మాతగా అనుష్కశర్మ చిత్రం!
ప్రియాంక చోప్రా సహ నిర్మాతగా వ్యవహరించనున్న ఒక చిత్రంలో అనుష్కశర్మ హీరోయిన్ గా నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం షూటింగ్ వచ్చే డిసెంబరులో ప్రారంభమవుతుందని, ఇందులో అనుష్క శర్మ పోలీసు పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. పర్పుల్ పెబెల్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా నిర్మించనున్న ఈ చిత్రం గురించి హీరోయిన్లు ప్రియాంక, అనుష్కలలో ఏ ఒక్కరూ ప్రస్తావించలేదు. కాగా, ఆర్టిస్ట్ గా, సింగర్ గా తానేంటో నిరూపించుకున్న ప్రియాంక చోప్రా నిర్మాతగా తెరకెక్కించాలనుకున్న ‘మేడమ్ జీ’ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని ప్రియాంక వెల్లడించింది.