: నాకెంతో గర్వంగా ఉంది: రజనీ తనయ ఐశ్వర్య
తన తండ్రికి పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా ధనుష్ స్పందించారు. ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందన తెలుపుతూ, బొకేలు, పూల వర్షాలను సూచించే ఎమోజీలను పోస్టు చేశారు. తన తండ్రికి ఇంతటి అవార్డు రావడం పట్ల, కుమార్తెగా తనకెంతో గర్వంగా ఉందని అన్నారు. కాగా, 2016 సంవత్సరానికిగాను పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను కేంద్రం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. కాగా, గతంలోనే రజనీకాంత్ కు పద్మభూషణ్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.