: ముగ్గురు తెలంగాణ జైలు వార్డర్లకు రాష్ట్రపతి పురస్కారాలు
ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణకు చెందిన ముగ్గురు జైలు వార్డర్లు రాష్ట్రపతి పురస్కారాలు అందకోబోతున్నారు. వారిలో చర్లపల్లి జైలు చీఫ్ హెడ్ వార్డర్ మనోహర ప్రసాద్, వరంగల్ సెంట్రల్ జైలు చీఫ్ వార్డర్ జైపాల్ రెడ్డి, మహిళా జైలు వార్డర్ బషీరాబేగం రాష్ట్రపతి పురస్కారాలు అందుకునే వారిలో ఉన్నారు. ఖైదీల సంస్కరణకు కృషి చేసినందుకుగాను ఈ ముగ్గురికీ కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు అందిజేస్తోంది.