: హెచ్ సీయూ విద్యార్థుల సస్పెన్షన్ పై హైకోర్టులో విచారణ... వాయిదా


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల సస్పెన్షన్ పై దాఖలైన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. వారిలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇటీవలే మిగతా నలుగురిపై సస్పెన్షన్ ఎత్తివేసినట్టు కోర్టుకు హెచ్ సీయూ తెలిపింది. ఇదే సమయంలో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రోహిత్ తల్లి పెట్టుకున్న పిటిషన్ పై కూడా కోర్టు విచారణ జరిపింది. దానిపై అదనపు సమాచారంతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ హోంశాఖ న్యాయవాది కోర్టును కోరారు. ఈ క్రమంలో రెండు పిటిషన్లపై తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News