: సినిమాకెళ్లిన కేజ్రీ... మోదీ నినాదాలతో హోరెత్తించిన ఢిల్లీ జనం


సినిమాకెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్న 'ఆప్' కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వింత అనుభవం ఎదురైంది. తన అనుంగు అనుచరుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తన కుటుంబసభ్యులతో కలిసి నిన్న ఢిల్లీలోని వైశాలి సెక్టార్ పరిధిలో ఉన్న అన్సల్ ప్లాజాకు వెళ్లిన కేజ్రీ అక్కడ ఓ సినిమా చూశారు. తనను ఎవరూ గుర్తించకముందే లోపలికి వెళ్లిపోయిన కేజ్రీ, సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మాత్రం జనం కంటబడ్డారు. కేజ్రీని చూసిన వెంటనే అక్కడి వారంతా ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో కేజ్రీ కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.

  • Loading...

More Telugu News