: కువైట్ లో పర్యటించనున్న మంత్రులు పల్లె, అచ్చెన్నాయుడు
ఏపీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కింజారపు అచ్చెన్నాయుడు కువైట్ లో పర్యటించబోతున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో అక్కడి ప్రవాసాంధ్రులతో వారు సమావేశాలు జరుపుతారు. రాష్ట్రాభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తారని ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగూస్ (ఏపీఎన్ఆర్ టీ) ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో స్మార్ట్ విలేజ్ దత్తతపై అవగాహన కల్పిస్తారని పేర్కొంది. ఈ కార్యక్రమాల్లో ఏపీఎన్ఆర్ టీ ప్రతినిధులు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి సంక్షేమం కోసం ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగూస్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏపీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. దానిని సీఎం చంద్రబాబు ఈ నెల 27న తిరుపతిలో ప్రారంభించనున్నారు.