: గుంటూరు జిల్లాలో ‘ఉగ్ర’ కలకలం... ఐఎస్ లో ఇద్దరు జిల్లా యువకులు?
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కేంద్రంగా మారుతున్న గుంటూరు జిల్లాలో నిన్న ‘ఉగ్ర’ కలకలం రేగింది. జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ లో పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాదులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా వారిలోని అబూ అనస్, నఫీజ్ ఖాన్ లు గుంటూరు జిల్లా యువకుల గురించిన సమాచారం వెల్లడించారు. ఈ విషయం నిన్న వెలుగులోకి రావడంతో జిల్లాలో పెను కలకలం రేగింది. ఐఎస్ లో చేరిన ఇద్దరు యువకులు ఎవరనే దానిపై జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు.