: ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్: నారా లోకేశ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతూ పరిపాలన కొనసాగిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఎస్ రావు నగర్ లో ఈరోజు సాయంత్రం నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదో చెప్పాలని అన్నారు. మంత్రి కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలంటే టీడీపీ-బీజేపీ కూటమికే ఓట్లు వేయాలని ప్రజలను ఆయన కోరారు.