: లండన్ లోనే ఎందుకు షూట్ చేశామంటే... దర్శకుడు సుకుమార్


‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని లండన్ లోనే ఎందుకు షూట్ చేశామంటే... రిచ్ నెస్ కోసం, షూటింగ్ పర్మిషన్లు అక్కడైతే తేలికగ్గా లభిస్తాయని, ఈ చిత్రాన్ని ఆ దేశంలోనే షూట్ చేశామని దర్శకుడు సుకుమార్ పేర్కొన్నారు. ఒక టీవీ చానెల్ తో ఆయన మాట్లాడారు. ఈ సినిమాను ఇక్కడ తీయకపోవడానికి కారణం ప్రతిదానికి సెట్ వేయాల్సి వస్తుందని, పర్మిషన్లు ఇక్కడ అంత తేలిగ్గా లభించవని అన్నారు. అదీగాక కథ కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి, లండన్ లో షూట్ చేస్తేనే సహజత్వం వస్తుందన్న ఉద్దేశ్యంతో అక్కడ చిత్రీకరించామన్నారు. యూకేలో ఎక్కడ షూట్ చేసినా ఆ రిచ్ నెస్ ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News