: బుల్లెట్ బైకెక్కి నడుపుకుంటూ మండపానికి వచ్చిన వధువు!


మేనమావలు, బావలు గంపలోనో లేదా పల్లకీలోనో మోసుకొస్తుంటే సిగ్గుతో తలదించుకుని వివాహ మండపంపైకి చేరుకునే పెళ్లికూతుళ్ల గురించి అందరికీ తెలిసిందే. కానీ గుజరాత్ కు చెందిన ఆయేషా ఉపాధ్యాయ్ రొటీన్ ఎందుకనుకుందో ఏమో! వెరైటీ కోసం బుల్లెట్ బండెక్కి స్వయంగా నడుపుకుంటూ మండపానికి వచ్చింది. ఆమెకు బైకులంటే ఎంతో ప్రాణం. ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆమెకు వివాహం నిశ్చయమైన వేళ, సోదరుడు కొత్త బుల్లెట్ బైక్ ను బహుమతిగా ఇచ్చాడు. ఆమె దానిపైనే దర్జాగా మండపానికి వచ్చింది. దీంతో ఆహూతులంతా తొలుత అవాక్కైనా, ఆపై ఆమెను అభినందించారు.

  • Loading...

More Telugu News