: జైలు గోడలను పేల్చి పారిపోయిన 100 మంది ఖైదీలు!


జైలు గోడలను బాంబులతో బద్దలు కొట్టి 100 మందికి పైగా ఖైదీలు పారిపోయిన ఘటన బ్రెజిల్ లో జరిగింది. డామియో డీ బొజానో జైల్లోని ఖైదీలు పారిపోగా, ఆపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఖైదీలు మరణించారని దినపత్రిక 'డైరియో డీ పెర్నాంబుకో' వెల్లడించింది. పారిపోయన వారిలో 40 మందిని సైన్యం తిరిగి బంధించిందని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. బ్రెజిల్ లో జైలు నుంచి భారీ సంఖ్యలో ఖైదీలు పారిపోవడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి. మూడు రోజుల క్రితం ఇటమరకా నగరంలోని బారెట్టో కాంపెల్లో జైలు నుంచి 53 మంది ఖైదీలు పారిపోగా, రెండు రోజుల్లోనే అందరినీ తిరిగి అదుపులోకి తీసుకోగలిగారు. తాజా ఘటనలో తప్పించుకున్న వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు బ్రెజిల్ అధికార వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News