: నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక


నేడు జరగనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షాకు మరోమారు అవకాశం లభించనుంది. 2014 వరకూ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన రాజ్ నాథ్ సింగ్, సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించి కేంద్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్ నాథ్ అనంతరం బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన అమిత్ షా పదవీకాలం నిన్నటితో ముగియడంతో నేడు ఆ పార్టీ సమావేశమై నేషనల్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోనుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు అమిత్ నియామకానికి అనుకూలంగా ఉండటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుందని తెలుస్తోంది. నేడు లాంఛనంగా నామినేషన్ దాఖలు చేసిన తరువాత పార్టీ చీఫ్ గా అమిత్ పేరును ప్రకటిస్తారు. ఆపై అమిత్ షా టీంకు మోదీ డిన్నర్ ఇవ్వనున్నారు. అమిత్ అధ్యక్షతన మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో సత్తా చాటిన బీజేపీ, ఢిల్లీ, బీహార్ లలో మాత్రం విఫలమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News