: కృష్ణా పుష్కరాల తేదీలు ఇవే!


ఈ ఏటి కృష్ణానది పుష్కరాల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకూ పుష్కరాలు జరుగనున్నాయి. గోదావరి పుష్కరాలు స్వల్ప అపశ్రుతులు మినహా దిగ్విజయం జరగడంతో అదే ఉత్సాహంతో కృష్ణమ్మకు కూడా వేడుకలు జరిపించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొత్తం 173 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ మంత్రి పి. మాణిక్యాలరావు వెల్లడించారు. పుష్కరాల సందర్భంగా నదీ తీరాన ఉన్న 326 ఆలయాలను అలంకరించనున్నామని వివరించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ 1800 425 6656 పనిచేస్తుందని పేర్కొన్నారు. కాగా, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో కృష్ణమ్మ ప్రవహించే మార్గాన వీలైనన్ని ఎక్కువ ఘాట్లను నిర్మించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.

  • Loading...

More Telugu News