: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పై ఐఎస్ఐఎస్ దంపతుల దాడి!


తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పై ఐఎస్ఐఎస్ దంపతులు దాడికి పాల్పడిన సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించారు. అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న సదరు ఉగ్రవాది బెంగళూరు శివారల్లోని ఒక అపార్టుమెంట్ లో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో తెలంగాణ పోలీస్, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కానిస్టేబుల్ పై ఉగ్ర దంపతులు కత్తితో దాడి చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని ఎన్ఐఏ పట్టుకుంది. ‘ఉగ్ర’ దంపతులను నిర్బంధించి ఎన్ఐఏ, తెలంగాణ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, భారత గణతంత్ర దినోత్సవం నాడు దేశ వ్యాప్తంగా పలు దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ పలు ప్రాంతాల్లో దాడులు జరిపి ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను అదుపులోకి తీసుకుంటోంది.

  • Loading...

More Telugu News