: బాలీవుడ్ నటుడు రిషికపూర్ కు స్వల్ప అనారోగ్యం


బాలీవుడ్ నటుడు రిషికపూర్ నిన్న స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని రిషికపూర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ ట్వీట్లు చేసిన అభిమానులందరికీ కృతఙ్ఞతలు తెలుపుతున్నట్లు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, నిన్న రిషికపూర్ మ్యారేజ్ డే. అదేరోజున ఆయన స్వల్ప అనారోగ్యానికి గురవడంతో మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ జరుపుకోలేదు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News