: ఎమ్మెల్యే కూతురి పర్సు చోరీ... స్పందించని రైల్వే సిబ్బంది!


యూపీలోని బల్ దేవ్ నియోజకవర్గ ఎమ్మెల్యే పూరణ్ ప్రకాశ్ కూతురు భావన ప్రకాశ్ పర్సును దుండగులు కొట్టేసిన సంఘటన ఈరోజు జరిగింది. జబల్ పూర్ నుంచి మహాకౌశల్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. రైలు ఝాన్సీ స్టేషన్ ను సమీపిస్తుండగా భావన పర్సు కనిపించలేదు. దీంతో ఝాన్సీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. తన పర్సులో సుమారు రూ. 4 లక్షల విలువైన నగదు, ఆభరణాలు ఉన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతకు ముందు, ఈ సంఘటనపై రైల్వేస్టేషన్ సిబ్బందికి భావన ఫిర్యాదు చేసింది. సదరు సిబ్బంది సక్రమంగా స్పందించకపోగా, ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమేనంటూ వారు కొట్టిపారేశారు. ఈ విషయాన్ని కూడా కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ప్రయాణం సమయంలో భావనతో పాటు తన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News