: కోర్టు ముందుకు నలుగురు ముష్కరులు... పీటీ వారెంట్లపై ఢిల్లీకి తరలింపు


గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దాడులు చేసేందుకు వచ్చిన నలుగురు ఉగ్రవాదులను నిన్న ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం వారు నలుగురిని హైదరాబాదు, నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. అయితే దేశవ్యాప్త కుట్ర నేపథ్యంలో నలుగురు ఉగ్రవాదులపై ఢిల్లీ హైకోర్టు పీటీ వారెంట్లు జారీ చేసింది. రేపు సాయంత్రంలోగా వారిని తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టులో హాజరు ముగియగానే పోలీసులు ఉగ్రవాదులను ఢిల్లీకి తరలించారు. రేపు ఉగ్రవాదులను ఢిల్లీ హైకోర్టులో హాజరుపరచనున్నారు.

  • Loading...

More Telugu News