: 'స్పీడున్నోడు'కి కేథరీన్ కితాబు!
కథానాయిక కేథరీన్ త్రెసా 'స్పీడున్నోడు' సినిమాలోని ఓ పాటను లాంచ్ చేసింది. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడి అభిమానులను అలరించింది. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా చూశానని, అద్భుతమైన డ్యాన్సులు, నటనతో ఆకట్టుకున్నాడని ఆమె చెప్పింది. ఈ టాలెంట్ తో టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడిగా తను ఎదుగుతాడని కేథరీన్ చెప్పింది. ఈ సినిమాకు పని చేసిన అందరికి అల్ ది బెస్ట్ చెప్పింది.