: యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్: కబీర్
'సరైనోడు' సినిమా ఫుల్లీ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ మూవీ అని ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర పోషించిన కబీర్ చెప్పాడు. ఈ సినిమా ఆడియో వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో సమపాళ్లలో ఉన్నాయని అన్నాడు. తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు చెప్పాడు. తెలుగు సినీ పరిశ్రమలో కమేడియన్ మధు మంచి స్నేహితుడని కబీర్ అన్నాడు. తనకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు అని చెప్పాడు. ఈ సమయంలో స్టేజ్ మీదకి వచ్చిన మధు కాసేపు నవ్వించే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.