: టీడీపీకి మహిళలే శ్రీరామరక్ష: బాలయ్య
తెలుగుదేశం పార్టీకి మహిళలే శ్రీరామరక్ష అని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. విశాఖపట్టణంలో నిర్వహించిన తెలుగు ఆడపడుచుల సీమంతం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు చీర, జాకెట్, పసుపుకుంకుమతో పాటు స్వీట్ బాక్స్ ఉన్న ఒక కవరును అందజేసి వారిని ఆయన ఆశీర్వదించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, ఏపీని సమర్థవంతంగా నడిపించగల నాయకుడు చంద్రబాబు నాయుడేనని అన్నారు. టీడీపీని నమ్మి ఓట్లేసిన వారికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు.