: ముంబయి రైల్వేస్టేషన్ లో ఉచిత వైఫై సేవలు ప్రారంభం


ముంబయి సెంట్రల్ రైల్వేస్టేషన్ లో గూగుల్ ఉచిత హైస్పీడ్ వైఫై సేవలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు తెలిపారు. రైల్ వైర్ నెట్ వర్క్ ద్వారా ప్రయాణికులు ఈ సేవలు పొందవచ్చని చెప్పారు. కాగా, భారత్ లోని నాలుగు వందల రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందించేందుకు గూగుల్ ఇండియా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. గత సెప్టెంబర్ లో ఈ మేరకు ప్రణాళికలు కూడా రూపొందించింది. ఇందులో భాగంగానే ముంబయి రైల్వేస్టేషన్ లో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చింది. తొలివిడతగా ఈ ఏడాది చివరి నాటికి 100 రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే అలహాబాద్, పాట్నా, జయపుర, రాంచీలలోనూ ఈ సేవలను ప్రారంభించనున్నట్లు గూగుల్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News