: ఆదాయపన్ను చెల్లింపు విషయంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు ఊరట


ఆదాయపన్ను చెల్లింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కు ఊరట లభించింది. రూ.1400 కోట్లు చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. ఈ మేరకు ఐటీ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచరాణను ఫిబ్రవరి ఒకటికి వాయిదా వేసింది. 2012-13 సంవత్సరానికి గానూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తమ ఆదాయాన్ని బడ్జెట్ లో చూపకుండా మినహాయిస్తూ ఆదాయపన్ను చెల్లించకుండా ఎగవేసిందని హైకోర్టులో ఐటీశాఖ గతంలో కేసు దాఖలు చేసింది. దాంతో పద్నాలుగు వందల కోట్ల రూపాయల పన్ను చెల్లించాల్సిందేనని ఏపీ బేవరేజెస్ ను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన సుప్రీం, స్టే ఇచ్చింది.

  • Loading...

More Telugu News