: చదరంగంపై ఇస్లాం నిషేధం: సౌదీ చీఫ్ ముఫ్తీ వితండవాదం
సౌదీ అరేబియా చీఫ్ ముఫ్తీ షేక్ అబ్దులాజిజ్ అల్-షేక్ చదరంగం క్రీడపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చెస్ ఆట గ్యాంబ్లింగ్ వంటిదని, దాన్ని ఇస్లాంలో నిషేధించినట్టు చెప్పిన ఆయన, దీన్ని ఆడటం వృథా అని, ముస్లింలు చెస్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దులాజిజ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు 'గార్డియన్' పత్రిక వెల్లడించింది. ఈ విషయం ఖురాన్ లో సైతం చెప్పబడిందని ఆయన తెలిపారట. కాగా, 70వ దశకంలో అప్పటి ఇరాన్ సీనియర్ మత గురువులు చెస్ ను నిషేధిస్తే, అయాతుల్లా రౌహోల్లా ఖోమైనీ పదవిలోకి వచ్చిన తరువాత దాన్ని తొలగించారు. కాగా, ఇప్పుడు సౌదీ ముఫ్తీ వ్యాఖ్యల పట్ల చెస్ ప్రేమికులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు.