: ఎమ్మెల్యే చెవిరెడ్డి కేసుతో మాకు సంబంధం లేదు: డిప్యూటీ సీఎం కేఈ


సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో రైలు దహనం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దానిపై వైసీపీ అధినేత జగన్ టీడీపీని తీవ్రంగా విమర్శించడాన్ని కేఈ తప్పుబట్టారు. జగన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. చెవిరెడ్డి కేసుతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేయడం మానుకోవాలని నెల్లూరులో సూచించారు.

  • Loading...

More Telugu News