: మంచు కొండల్లో రఘువీరా!... 59 ఏళ్ల వయసులో ట్రెక్కింగ్ చేస్తున్న కాంగ్రెస్ నేత
ఏపీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి 60 ఏళ్లకు చేరువయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 59 ఏళ్లు. అయితేనేం... ఆయనలోని సాహసాల గుణం ఇంచు కూడా తగ్గలేదు. ట్రెక్కింగ్ అంటే బాగా ఇష్టపడే రఘువీరారెడ్డి ప్రస్తుతం హిమాలయాల్లో మంచు కొండలను లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. నాలుగు రోజులుగా సాగుతున్న ట్రెక్కింగ్ లో రఘువీరా...30 ఏళ్ల లోపు వయసున్న 16 మంది యువకులతో పోటీ పడి మరీ నడుస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జోషిమఠ్ లో ప్రారంభమైన ఈ సాహస యాత్రలో రఘువీరా తనకు కనిపించిన గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులు, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. సముద్ర మట్టానికి దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో, ఎముకలు కొరికే చలిలో రఘువీరా ట్రెక్కింగ్ ను ఓ తెలుగు దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది.