: రేపటి నుంచి ప్రత్యేక రైళ్లు : రైల్వే అధికారులు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 22 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. విజయవాడ-విశాఖ, విశాఖ- ధర్మవరం, హైదరాబాద్-చెన్నై మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వాటి వివరాలు.. రేపు రాత్రి 10.40 గంటలకు హైదరాబాద్- చెన్నై, 23వ తేదీ రాత్రి 8 గంటలకు చెన్నై-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ-విశాఖ మధ్య ఈ నెల 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11 గంటలకు, విశాఖ- విజయవాడ మధ్య ఈ నెల 31, ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు, విశాఖ- ధర్మవరం మధ్య ఈ నెల 29, ఫిబ్రవరి 5,12,19,26 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు, ధర్మవరం-విశాఖ మధ్య ఈ నెల 30, ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు అధికారులు వివరించారు.