: నేను సవాల్ విసరను: ఎంపీ వీహెచ్
‘నేను సవాల్ విసరను.. నేను సవాల్ చెప్పను’ అని ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి సింగిల్ డిజిట్ స్థానాలు రావడం కూడా కష్టమేనని మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ పై మీడియా వీహెచ్ ని ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు 52 సీట్లు వచ్చాయని.. ఈసారి కూడా తాము ఎక్కువ సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు లేవని, టీఆర్ఎస్ లో పోటీ చేస్తున్నవారంతా తమ వాళ్లేనని, వాళ్లను లాక్కెళ్లి మరీ పోటీ చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పథకాలను టీఆర్ఎస్ తమవిగా ప్రచారం చేసుకుంటోందని ఆయన విమర్శించారు.