: మాతృభాషలో మాట్లాడినందుకు మధ్యాహ్న భోజనం చెయ్యనివ్వలేదు!


మాతృభాషలో మాట్లాడినందుకు పదమూడు మంది చిన్నారులను మధ్యాహ్న భోజనం చేయకుండా పాఠశాల యాజమాన్యం అడ్డుకుంది. ఈ విపరీత సంఘటన అసోంలోని గువాహటిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో జరిగింది. విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడాలన్నది పాఠశాల నిబంధన. ఈ నిబంధనను ఆ విద్యార్థులు ఉల్లంఘించారని పాఠశాల యాజమాన్యం ఆరోపించింది. విద్యార్థులను మధ్యాహ్న భోజనం చేయనీయకుండా సుమారు గంటపాటు నిలిపివేశారు. ఈ సంఘటనపై అసోం జిల్లా అధికారులు స్పందించి, దర్యాప్తునకు ఆదేశించారు. వారం రోజుల్లోగా విచారణ జరిపి తమకు నివేదిక సమర్పించాలని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రతిమను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ, అసోంలోని ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రాథమిక భాషగా అస్సామీని తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసిందన్నారు.

  • Loading...

More Telugu News