: ఆటల పోటీల్లో అపశృతి.. ఏడో తరగతి విద్యార్థి మృతి!


భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని కోతల్ గాం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న సాయిచరణ్ అనే విద్యార్థి పరుగు పందెం పోటీల్లో పాల్గొన్నాడు. కొంతదూరం పరిగెత్తిన తర్వాత సాయిచరణ్ కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు. ఇది తెలిసి విద్యార్థి తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. కాగా, పాఠశాల సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News