: దేశంలోని రక్షణ స్థావరాల భద్రతా పరిశీలనకు కమిటీ వేస్తున్నాం: పారికర్
ఇటీవల పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం రక్షణ స్థావరాల భద్రతకు ఓ కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రక్షణ స్థావరాల భద్రతను పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించనున్నట్టు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ముప్పు పొంచి ఉన్న రక్షణ స్థావరాలను గుర్తించడం ఈ కమిటీ కర్తవ్యమని చెప్పారు. ఇప్పటికే పలు స్థావరాల కమాండింగ్ అధికారులతో మాట్లాడామని, స్థావరాల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించి లోపాలను సరిదిద్దాలని సూచించామని తెలిపారు. కమిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ నాలుగు రోజుల్లో వెలువడుతుందని వివరించారు. ఈ బృందం సున్నితమైన ప్రదేశాలను గుర్తించడం, కీలక సామగ్రి రక్షణ, భద్రతా లోపాలను పరిశీలిస్తుందని పారికర్ పేర్కొన్నారు.