: ఉత్సాహంగా ఉన్నా భయమేస్తోంది: దీపికా పదుకొనే


హాలీవుడ్ సినిమా 'xxx-ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్' సినిమాలో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నా, భయమేస్తోందని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తెలిపింది. ఢిల్లీలో ప్రఖ్యాత వాచ్ కంపెనీ టిస్సో ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విన్ డీజిల్, శామ్యూల్ ఎల్ జాక్షన్ వంటి నటులతో నటించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. అయితే కాస్త భయంగా కూడా ఉందని తెలిపింది. తన నేపథ్యం, భారతీయతను చూసి దర్శకుడు డీజే క్యార్సో ఈ సినిమాలో అవకాశం ఇచ్చారని దీపిక అంది. నటించేందుకు భయమేస్తున్నా, తనను ఎంపిక చేసుకోవడం పట్ల గర్వంగా ఉందని ఆనందంగా చెప్పింది.

  • Loading...

More Telugu News