: 'లగ్జరీ రియల్ ఎస్టేట్స్' బ్రాండ్ అంబాసిడర్ గా కోహ్లీ


టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సంస్థకు అంబాసిడర్ గా నియామకం అయ్యాడు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్ధ 'లగ్జరీ రియల్ ఎస్టేట్స్'కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కోహ్లీ తెలిపాడు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న బెంగళూరు నగరానికి చెందిన ఈ సంస్థకు అంబాసిడర్ గా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. తొలితరం రియల్ ఎస్టేట్ సంస్థ అయిన లగ్జరీ రియల్ ఎస్టేట్స్ అతి తక్కువ సమయంలోనే విశేషమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నాడు. సాధారణ ఇళ్లు, హోటళ్లు, కార్యాలయాలు, భవంతుల విషయంలో ఆ సంస్థ అందిస్తున్న నాణ్యత తనను ఎంతగానో ఆకర్షించిందని, అందుకే ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కోహ్లీ వివరించాడు.

  • Loading...

More Telugu News