: హెచ్ సీయూలో నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత


నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎత్తివేసింది. ఈ మేరకు ప్రశాంత్, విజయ్, శేషయ్య, సుంకన్నలపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్టు వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రోజు జరిగిన పాలకమండలి సమావేశంలో వర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. తరగతులు, పరిశోధనలకు అడ్డంకులు లేకుండా సహకరించాలని ఈ సందర్భంగా వర్సిటీ యాజమాన్యం విద్యార్థులను కోరింది. సమస్యలపై అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకుందామని, వర్సిటీలో ప్రశాంతత నెలకొనేలా చూడాలని వీసీ అప్పారావు కోరారు. గతంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ సహా పై నలుగురు విద్యార్థులపై వర్సిటీ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News