: బీ-ఫాం ఇవ్వలేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
తొలుత కార్పొరేటర్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించి, ఆపై బీఫాం మరో అభ్యర్థికి ఇవ్వడంతో గాంధీభవన్ లో కిషోర్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. దీన్ని గమనించి పోలీసులు కిషోర్ యత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం కిషోర్ ప్రసంగిస్తూ, కొందరు నేతలు టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. కాగా, నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుండటంతో మధ్యాహ్నం 3 గంటల వరకూ 594 మంది పోటీ నుంచి తప్పుకున్నట్టు అధికారులు ప్రకటించారు. మరోవైపు బరి నుంచి రెబల్స్ ఉపసంహరించుకునేలా చేసేందుకు అన్ని పార్టీలూ బుజ్జగింపు యత్నాల్లో బిజీగా ఉన్నాయి.