: తన పెళ్లి ఆగిపోయిందంటూ హాస్య నటుడు వెన్నెల కిషోర్ ఫన్నీ ట్వీట్!
నాలుగోసారి కూడా తన పెళ్లి ఆగిపోయిందంటూ సినీ హాస్యనటుడు వెన్నెల కిషోర్ ట్వీట్ చేశాడు. అయితే, ఈ ఆగిపోయిన పెళ్లిలన్నీ ఆయన నిజ జీవితానికి సంబంధించినవి కాదులెండి.. సినిమా జీవితానికి సంబంధించినవి! ఇటీవల కాలంలో వెన్నెల కిషోర్ వరుసగా ఇటువంటి పాత్రలనే పోషిస్తున్నారు. పీటల మీదకు వచ్చే వరకు అంతా సవ్యంగా జరగడం..ఆ తర్వాత, పీటల మీద హీరోయిన్ ను హీరో తీసుకుపోవడం వంటి సన్నివేశాలు ఆయన చిత్రాల్లో బాగానే ఉన్నాయి. ఈ తరహా పాత్రలను వెన్నెల కిషోర్ వరుసగా చేస్తున్నాడు. ఈ వారంలో తాను నటించిన చిత్రాల్లో ఆగిపోయిన నాలుగు పెళ్లి సన్నివేశాలను గుర్తుచేస్తూ ఈ ట్వీట్ చేశాడు. పెళ్లి గెటప్ లో ఉన్న ఒక ఫొటోను కూడా వెన్నెల కిషోర్ పోస్ట్ చేశాడు.