: సెక్యూరిటీ గార్డు హత్య కేసులో కేరళ పారిశ్రామిక వేత్తకు జీవిత ఖైదు


కేరళకు చెందిన ప్రముఖ బీడీ పారిశ్రామికవేత్త మహ్మద్ నిషామ్ కు జీవితఖైదు పడింది. సెక్యూరిటీగార్డు చంద్రబోస్ హత్యకేసులో నిన్న(బుధవారం) ఆయనను దోషిగా తేల్చిన త్రిసూర్ డిస్ట్రిక్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి, ఇవాళ జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెల్లడించారు. ఇదే కేసులో అతనికి కోర్టు రూ.70 లక్షల జరిమానా కూడా విధించింది. ఇందులో రూ.50 లక్షలు గార్డు చంద్రబోస్ కుటుంబానికి నష్టపరిహారంగా ఇవ్వనున్నారు. 2014, డిసెంబర్ 19న గార్డును నిషామ్ తన కారుతో ఢీకొట్టాడు. దాంతో తీవ్రగాయాల పాలైన గార్డు 48 రోజుల తరువాత ఆసుపత్రిలో గతేడాది ఫిబ్రవరి 15న చనిపోయిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News