: ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్లుగా అమితాబ్, ప్రియాంకా చోప్రా
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’కు కొత్త ప్రచారకర్తలుగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అందాల తార ప్రియాంకా చోప్రాలు ఎంపికయ్యారు. అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే పేర్లను పరిశీలించినప్పటికీ కేంద్రం... అమితాబ్, ప్రియాంకాల వైపే మొగ్గు చూపింది. మొన్నటిదాకా ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ను ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్న ప్రభుత్వం... తాజాగా అమితాబ్, ప్రియాంకాలను తానే నేరుగా నియమించుకోనుంది. మూడేళ్ల కాలానికి వీరిని బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకోనున్న కేంద్రం వారికి సింగిల్ పైసా పారితోషికం కూడా చెల్లించదట. ఈ మేరకు అమితాబ్, ప్రియాంకాలను ఎంపిక చేసిన కేంద్రం త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.