: ఆసుపత్రిలో కీచకులు... మంత్రి కామినేని ఆగ్రహం


వైద్యం కోసం వచ్చిన ఓ మహిళపై డాక్టరుతో చేతులు కలిపిన రేడియాలజిస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. ఆ ఇద్దరు తమ వద్దకు చికిత్సలు, పరీక్షల నిమిత్తం వచ్చే మహిళలను తరచూ వేధిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. డాక్టరుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు బాధితురాలితో రాజీ కుదిర్చిన విషయం తెలుసుకున్న కామినేని, విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చే నివేదికను అనుసరించి వారిపై చర్యలు తీసుకుంటామని ఈ ఉదయం మీడియాకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News