: అత్యంత వేడిపుట్టించిన సంవత్సరంగా 2015
ప్రపంచవ్యాప్తంగా 1880 నుండి చూస్తే చారిత్రాత్మక రీతిలో ఆధునిక కాలంలో 2015లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మోస్పెరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. వాతావరణంలో సంభవించిన అనూహ్య మార్పుల కారణంగానే ఇలా జరిగినట్టు పేర్కొంది. 1880 తరువాత 2015లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రికార్డులు తెలియజేస్తున్నాయని పేర్కొంది. 2015లో ప్రపంచ భూభాగంతోపాటు సముద్ర ఉపరితలంపై సగటున 1.62 ఫారెన్ హీట్(0.9 సెల్సియస్) ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఎన్ఓఏఏ వెల్లడించింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు ప్రపంచానికి పెనుసవాల్ గా పరిణమించాయని తన రిపోర్టులో పేర్కొంది.