: 'మా అన్న జీహాదీ జాన్ మృతి చెందలేదు' అంటున్న అతని సోదరి


జీహాదీ జాన్ గా పిలవబడుతున్న తన సోదరుడు సిద్ధార్థ్ ధర్ అలియాస్ రుమేసహ్ మృతి చెందాడంటే నమ్మలేకపోతున్నామని ఆయన సోదరి కోనికా ధర్ తెలిపింది. బ్రిటన్ పార్లమెంటులో ఆమె మాట్లాడుతూ, వీడియోల్లో వాడిన భాషను బట్టి అతను తన సోదరుడే అని ప్రధాని పేర్కోవడం సరికాదని చెప్పింది. తన సోదరుడు బతికే ఉన్నాడని భావిస్తున్నానని ఆమె తెలిపింది. తన సోదరుడు హిందూ ఉదారవాద కుటుంబంలో జన్మించాడని, తీవ్రవాద చర్యలకు పాల్పడే మనస్తత్వమున్నవాడు కాదని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. తన సోదరుడు ఉగ్రవాది కాదని నిరూపిస్తానని ఆమె తెలిపింది. ఈ సందర్భంగా రుమేసహ్ మృతిచెందలేదని ఎలా నిరూపిస్తావని కామన్స్ హోం ఎఫైర్ కమిటీ ప్రశ్నించగా, తన అన్నను గత సెప్టెంబర్ లో చూశానని, ఆ తరువాత అతను సిరియా వెళ్లిపోయాడని, అతనితో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించగా, రెండు సార్లు తమతో మాట్లాడాడని ఆమె తెలిపింది. సిరియాలో అతను ఉండే అవకాశం లేదని పేర్కొన్న ఆమె, తన సోదరుడి కుటుంబం బంధించబడి ఉంటుందని ఆమె అభిప్రాయపడింది. వ్యాపారం నిమిత్తం బ్రిటన్ వెళ్లిన సిద్దార్థ్ ధర్ మతం మార్చుకుని రుమేసహ్ గా మారిన సంగతి తెలిసిందే. అనంతరం అల్ మహజిరౌన్ అనే రాడికల్ సంస్థలో చేరి వివాదాస్పద ప్రసంగాలతో మతవ్యాప్తికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బెయిల్ ఇవ్వడంతో భార్య, నలుగురు పిల్లలతో కలసి 2014లో సిరియా పారిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News