: ఈ ముగ్గురు పిల్లలు చాలా బాగున్నారు: మహేశ్ బాబు


'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమా నిర్మిస్తున్న 14 రీల్స్ అంటే తనకు సొంత బ్యానర్ లాంటిదని ప్రముఖ నటుడు మహేశ్ బాబు చెప్పాడు. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' ఆడియో వేడుకలో పాల్గొన్న సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ, నాని నటన అద్భుతమని చెప్పాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని మహేశ్ అన్నాడు. సినిమా దర్శకుడు హను రాఘవపూడి మరిన్ని మంచి సినిమాలు రూపొందించాలని అన్నాడు. ఈ సినిమాలో నటించిన ముగ్గురు పిల్లలు చాలా బాగున్నారని మహేశ్ బాబు అభినందించాడు. సినిమాకు పనిచేసిన అందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పాడు.

  • Loading...

More Telugu News