: ఓటమికి కారణం నేనే: ధోనీ
వరుస ఓటములు జట్టును ఇబ్బంది పెడుతున్నాయని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. నాలుగో వన్డేలో ఓటమి అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ సిరీస్ లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన మ్యాచ్ ఇదేనని చెప్పాడు. ఈ మ్యాచ్ లో ఓటమిపాలవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ధోనీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో ఓటమికి బాధ్యత వహిస్తున్నానని ధోనీ తెలిపాడు. ఒత్తిడికి గురవ్వడంతో వికెట్లు పారేసుకున్నామని ధోనీ చెప్పాడు. అంతర్జాతీయ మ్యాచ్ అంటే ఒత్తిడి ఉంటుందని పేర్కొన్న ధోనీ, తాను అనవసరమైన షాట్ ఆడానని అంగీకరించాడు. విజయం సాధించాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలవ్వడం నిరాశకు గురి చేసిందని ధోనీ తెలిపాడు.