: రోబోలే పెళ్లి పెద్దలు ...వినూత్న వివాహం
చైనాలోని షెన్ యాంగ్ లో ఓ ఐదు జంటలు తమ వివాహాన్ని వినూత్నంగా నిర్వహించుకోవాలని భావించారు. దీంతో రోబోలను నిర్మించే కర్మాగారంను తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు. దీంతో ఈ ఐదు జంటల వివాహ వేడుకలకు రోబో కర్మాగారం సిద్ధం కాగా, రోబోలు పెద్దల పాత్రలు పోషించేందుకు రెడీ అయిపోయాయి. వివాహం కోసం వచ్చిన వధూవరులకు ఓ రోబో స్వాగతం పలుకగా, మరో రోబో వారికి అవసరమైన పనులు చేసేందుకు సిద్ధమైంది. వివాహ వేడుకలకు హాజరైన బంధుజనానికి ఏర్పాట్లు చేసింది మరో రోబో. వివిధ ఆకారాల్లోని రోబోలు ఈ వివాహంలో అతిథులుగా పాల్గొన్నాయి. ఫ్యాక్టరీ సిబ్బంది, రోబోల మధ్య ఐదు జంటలు తమ వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.