: మీసకట్టుతో లుక్ మార్చిన చిరంజీవి...150వ సినిమా ప్రారంభానికి సిద్ధం?


టాలీవుడ్ మెగాస్టార్ చిరింజీవి న్యూలుక్ లో దర్శనమిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేసిన చిరంజీవి తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ లో చేరి, కేంద్ర మంత్రిగా పదవీబాధ్యతలు నిర్వర్తించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజయం కారణంగా రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటిస్తూ 150వ సినిమాలో నటించే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా స్లిమ్ అయిన చిరంజీవి, మళ్లీ గ్లామర్ సంతరించుకున్నారు. 'ఇంద్ర', 'అందరివాడు' సినిమాల్లో కనిపించిన మీసకట్టుతో చిరంజీవి ప్రస్తుతం కనిపిస్తున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో కోలీవుడ్ లో విజయవంతమైన 'కత్తి' సినిమా రీమేక్ లో ఆయన మరోసారి ఈ లుక్ లో కనబడనున్నారని, సినిమా ఓ రేంజ్ లో ఉండబోతోందని ఫిల్మనగర్ భోగట్టా.

  • Loading...

More Telugu News