: విమానంలో ‘సోనూ’ పాట .. ప్రయాణికుల ఆనందం!


ముంబయి - జోథ్ పూర్ విమానంలో ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ పాటలు పాడి ప్రయాణికులను అలరించారు. వీర్- జారా, రెఫ్యూజీ చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ను సోనూ పాడారు. ప్రయాణికులు కూడా తమ గళాలను కలపడంతో సోనూ ఆనందం వ్యక్తం చేశాడు.. వారిని అభినందించాడు. అంతకుముందు, ఫ్లైట్ అటెండెంట్ మైక్రోఫోన్ తీసుకుని ప్రయాణికులు సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోనూ చెప్పారు. ‘ఇంత మధురమైన స్వరం సోనూ నిగమ్ ది కదా?’ అని ప్రయాణికులు అనుకుంటుండగానే వారి ముందు ఆయన ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎంటర్ టెయిన్ మెంట్ బ్లాగర్ మిస్ మాలిని.కామ్ లో పోస్ట్ చేశారు. ట్రాక్ ప్యాంట్, సింపుల్ టీ-షర్టు ధరించిన సోనూతో కలిసి ప్రయాణం చేయడంతో విమాన ప్రయాణికులు, అభిమానుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News