: అఖిలేష్ సర్కార్ పై ‘సుప్రీం’ సీరియస్!


ఉత్తరప్రదేశ్ సర్కార్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. యూపీలో లోకాయుక్త నియామకం విషయంలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టించిందని సుప్రీంకోర్టు మండిపడింది. ఉత్తరప్రదేశ్ లోకాయుక్తగా మాజీ జడ్జి వీరేంద్రసింగ్ నియామకాన్ని కొనసాగించాలా? లేకపోతే రద్దు చేయాలా? అనే విషయమై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని ‘సుప్రీం’ స్పష్టం చేసింది. గత నెలలో యూపీ లోకాయుక్తగా మాజీ జడ్జి వీరేంద్రసింగ్ ను సుప్రీంకోర్టు నియమించింది. సీఎం అఖిలేష్ యాదవ్, ప్రతిపక్ష నేత స్వామి ప్రసాద్ మౌర్య, అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తో కూడిన కమిటీ ఈ నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. వీరేంద్ర సింగ్ కు సరైన వ్యక్తిత్వం లేదని, ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో స్వామి ప్రసాద్ మౌర్య కూడా ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News