: అమీర్ స్పందనకు ఉబ్బితబ్బిబైన సన్నీలియోన్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్పందనకు పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఉబ్బితబ్బిబయింది. ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలిపింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో సన్నీలియోన్ చెప్పిన సమాధానాలు, చాలా ఓపికగా, హుందాతనంగా ఉన్నాయి. ముఖ్యంగా సన్నీ లియోన్ గత జీవితానికి సంబంధించిన పలు విషయాలపై ఈ ఇంటర్వ్యూలో ఆమెను ప్రశ్నించారు. కొన్ని అభ్యంతరకరమైన ప్రశ్నలకు ఆమె చెప్పిన సమాధానాలు పలువురి ప్రశంసలు పొందాయి. ఈ నేపథ్యంలోనే అమీర్ ఖాన్ ఆమెను ప్రశంసించారు. ఆ సమయంలో తానున్నా ఇవే సమాధానాలను చెప్పే వాడినని.. సన్నీ ఎంతో హుందాగా ప్రవర్తించిందని.. ఆమెతో కలిసి పనిచేయడాన్ని ఆనందంగా భావిస్తానని, సన్నీ గతంతో తనకు పనిలేదని అమీర్ పేర్కొన్నాడు. కాగా, అమీర్ ఖాన్ తనకు మద్దతుగా నిలవడంతో సన్నీలియోన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.